ప్రతి స్థలము నుండి దేవునికి మొఱ్ఱపెట్టు విశ్వాసగృహములోని ప్రతివారికి,యేసు ప్రభువు వారి ప్రేమ ద్వారా మా హృదయ పూర్వక శుభాభివందనములుదేవుని కృప వలన తెలుగు భాష యందు “యేసుప్రభుని చివరి ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకోగలం?” అను పుస్తకమును ఆంగ్లము నుండి తర్జుమా చేయుటకు పరిశుద్ధాత్మ సహకారం అనుగ్రహించడినదని విశ్వసిస్తూ..ఈ పుస్తకమును మీ ముందు ఉంచడంలో సంతోషిస్తున్నాము.ఈ చిన్న పూస్తకములో, యేసు ప్రభువు వారి జీవితములో చివరి రాత్రి గెత్సమనే తోటలో తను ముమ్మారు ప్రార్థించినటువంటి ప్రార్థనను మనం ధ్యానించగా తన యొక్క విశ్వాస వైర్యాగాన్ని ,గుణ లక్షణాన్ని మరియు హృదయ స్థితిని స్పష్టంగా తెలుసుకునుటకు దోహదపడుతుంది. దేవునితో సంబంధాన్ని ఎలా కొనసాగించాలి అనే పాఠములతో పాటుగా ప్రార్థనలోని అనేక మెలుకువలను నేర్పుచున్నది. ఇట్టి ప్రార్థన విధానమును తప్పనిసరిగా అనుసరించుటకు ప్రయాస పడదాం..!