ప్రతి స్థలము నుండి దేవునికి మొఱ్ఱపెట్టు విశ్వాసగృహములోని ప్రతి ఒక్కరికీ, యేసు ప్రభువు వారి ప్రేమ ద్వారా మా హృదయ పూర్వక శుభాభివందనములు🙏🛐💐
దేవుని కృప వలన తెలుగు భాష యందు “యేసు జీవితపు చివరి వారంలో – యేసుతో హృదయ ఐఖ్యత” అను పుస్తకమును ఆంగ్లము నుండి తర్జుమా చేయుటకు పరిశుద్ధాత్మ సహకారం అనుగ్రహించడినదని విశ్వసిస్తూ… ఈ పుస్తకమును మీ ముందు ఉంచడంలో సంతోషిస్తున్నాము.
ఈ చిన్న పుస్తకములో, యేసు ప్రభువు వారి జీవితములోని చివరి వారం గురించి వీలైనంత సులువుగా, సజావుగా విశదీకరించబడినది. కావున రానున్న ప్రభువు రాత్రి భోజనముకు మనము సిద్దపడటానికి మరియు ఆయన సహవాసంలో ఆయనతో కలిసి నడవటానికి మరియు ఆయన ప్రేమపూర్వక త్యాగానికి సంబంధించిన అన్ని విషయాలను మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనతో మన హృదయ సంబంధాన్ని పెంపొందించాలనే ప్రార్థన తో, ఈ పుస్తకం మీ కొరకు…