ప్రతి స్థలము నుండి ప్రభువునకు మొఱ్ఱపెట్టు విశ్వాసగృహములోని వారికి మా ప్రేమ పూర్వక శుభాభివందనములు ప్రతి సంవత్సరం మనం యేసు ప్రభువు మరణించిన దినాన్ని జ్ఞాపకార్థముగా జరుపుకుంటున్నప్పుడు, మనం ఆయనకు సన్నిహితమౌతున్నాము, ప్రత్యేకించి ఆయన మరణంలో ముగిసిన లేదా తన చివరి దినములలో అనుభవించిన శ్రమలను గురించి తెలుసుకోవడం ద్వారా మరింత దగ్గరవుతున్నాము. ఈ చిన్న పూస్తకములో, యేసు ప్రభువు జీవితములోని చివరి రాత్రి అనుభవాలు, ఆయనకు జరిగిన విచారణనలను గూర్చి మరియు పాత్రలను గూర్చి పొందుపరచబడియున్నది. ఇందులో యేసుప్రభువు కాకుండా ఇతర పాత్రలను గురించి కూడ తెలుసుకుంటే విచారణను బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఆయన నూతన సృష్టికి మాదిరిగా ఉన్నాడు, కాబట్టి అది వారు ఆత్మీయముగా బలపడుటకు ఉపయోగపడుతుంది.