క్రీస్తులో ప్రియమైన సహోదరులారా! యేసుక్రీస్తు పునరుత్థానం కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, అది అపొస్తలుల జీవితాలను పూర్తిగా మార్చివేసిన ఒక గొప్ప మలుపు. చేపల వేట వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న శిష్యులను, తన దివ్య ప్రత్యక్షతతో తిరిగి రాజ్య సేవ వైపు ఎలా మళ్లించారో ఈ అధ్యయనం వివరిస్తుంది.
ఇందులో మరీ ముఖ్యంగా: శిష్యులు అయోమయంలో ఉన్నప్పుడు ప్రభువు వారికి నేర్పిన పాఠం వారి జీవితాల్లో ఎంతటి బలమైన ముద్ర వేసిందో తెలుస్తుంది. పునరుత్థానం తర్వాత ప్రభువు కేవలం మనుష్యునిగా కాక, ఆత్మ సంబంధమైన స్థితిలో ఎలా ఉన్నారో మరియు ఆయన మార్పులోని మర్మాన్ని చార్లెస్ టేజ్ రస్సెల్ గారి వివరణలతో అర్థం చేసుకోవచ్చు. అలానే, “నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా” క్రీస్తు లేపబడటం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని మరియు అది మన నిరీక్షణకు ఎలా పునాది వేసిందో ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.
మన విశ్వాస యాత్రలో అపొస్తలుల వలె మనం కూడా ప్రభువు చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఈ వివరణ ఎంతో సహాయపడుతుందని విశ్వసిస్తున్నాము.