క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం జ్యేష్ఠత్వము అనే అంశంలో,
● జ్యేష్ఠత్వము అంటే ఏమిటి?
● దాని ప్రాముఖ్యత ఏమిటి?
● పాత నిబంధన కాలం నాటి ఆచారంలో ఉన్న జ్యేష్ఠత్వము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండేది. ఈ జ్యేష్ఠపుత్రభాగాన్ని ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావు, తన తమ్ముడైన యాకోబుకు ఒక పూట కూటి కోసం అమ్మివేశాడు. అలా కొన్న యాకోబును చూసి క్రైస్తవులు అతను మోసగాడని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మోసగాడి గురించి లేఖనం ఏమి చెబుతుందంటే, యాకోబు ప్రేమించబడినవాడని, ఏశావు దేవుని చేత ద్వేషించబడినవాడని చెప్పబడింది. అలాంటప్పుడు యాకోబును ప్రేమించడానికి అతను చేసిన మంచి ఏమిటి?
● ఏశావును ద్వేషించడానికి అతను చేసిన తప్పు ఏమిటి?
● దేవుడు మోసగాళ్లను ప్రేమిస్తాడా?
ఇందులో ఏదో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. కాబట్టి జ్యేష్ఠత్వము అనే ఈ పాఠంలో, ఏ రహస్యం ఉందనే విషయాన్ని, దాని ద్వారా మనకు ఏ పాఠం ఉంది అనేదాన్ని దేవుని వాక్య ఆధారంగా పరిశీలిద్దాం.