క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనము బైబిలులో చెప్పబడిన సుమారు 1817 ప్రవచనాలలో మొదటి ప్రవచనమును గూర్చి పరిశోధించబోతున్నాము.
● మొదటి ప్రవచనము (దీర్ఘ దర్శనం) ఏమిటి?
● ఈ ప్రవచనమును ఎలా చూడాలి?
● ఇది ఎప్పుడు నెరవేరుతుంది?
● ఇది ఎవరిని గూర్చి చెప్పబడింది?
ఈ ప్రవచనాలన్నీ మనుష్య ఆలోచనల ప్రకారం చెప్పబడినవి కావు. ప్రవచనాలను పరిశోధించడానికి ఒక పద్ధతి ఉన్నది. బైబిలులో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరవలసి ఉన్నవి. ఈ విధంగా చెప్పబడిన మొదటి ప్రవచనమును మరియు దాని నెరవేర్పును గూర్చి లేఖనాల ఆధారంగా పరిశోధిద్దాము.