VIEWS

PageS
0

Tabernacle | ప్రత్యక్షపు గుడారము

క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!

ఈరోజు మనం పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, వారి మొరను విని, దేవుడు అబ్రాహాముకు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, వారిని ఆ బానిసత్వం నుండి విడిపించడానికి, మోషేను దేవుడు ఎన్నుకొని, మోషే ద్వారా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను బయటకు తీసుకురావడానికి, పది తెగుళ్లను పంపి, పదవ తెగులైన జ్యేష్ఠపుత్రుల సంహారము అనే తెగులును చూసిన ఫరో, ఇశ్రాయేలీయులను పంపివేసాడు. ఈ ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి కనానుకు ఎర్రసముద్రాన్ని దాటించి అరణ్య మార్గము ద్వారా నడిపించాడు. అప్పుడు దేవుని మహత్యాన్ని, శక్తిని, పరాక్రమాన్ని కళ్లారా చూసి అనుభవించిన ఇశ్రాయేలీయులు, దేవునిని విడిచి దూరంగా వెళ్లారు. అయినప్పటికీ దేవుడు వీరిని అలాగే విడిచిపెట్టకుండా, వారిని విమోచించాలని చిత్తము కలిగి, వారి మధ్య నివసించడానికి ఆయనకు ఒక నివాస స్థలమును నిర్మించేలా, సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు చెప్పిన ప్రకారం చేయబడినదే ప్రత్యక్షపు గుడారము.
● ఈ ప్రత్యక్షపు గుడారమ, దాని అమరికల గురించి, ఇవి ఎందుకోసం చేయబడ్డాయి?
● ఇది దేనికి నీడగా ఉంది?
● ఇది మనకు ఎటువంటి బోధను ఇస్తుంది?
● దీనిని ఎందుకోసం చూడాలి?
అనే ప్రశ్నలకు సమాధానాన్ని లేఖనాల ద్వారా వివరంగా పరిశీలిద్దాం.

Facebook
WhatsApp
Telegram
Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *