క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
పాత నిబంధనలో జరిగిన నయమాను కుష్టురోగం నివారణకు, అతడు యోర్దానులో ఏడుసార్లు మునిగి శుద్ధుడైన సంఘటనను పరిశీలించేలా,
● నయమాను ఎవరు?
● నయమాను పని ఏమిటి?
● నయమాను ఏ ప్రాంతపు వాడు?
● నయమాను కుష్టురోగం ఎలా నయమైంది?
● ఈ కుష్టురోగాన్ని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయి?
● కుష్టురోగం యొక్క ప్రభావం ఏమిటి?
● నయమాను కుష్టురోగం నయం కావడానికి యోర్దానులో ఏడుసార్లు మునగడం దేనిని సూచిస్తుంది?
● ఈ అన్యుడైన నయమాను కు మాత్రమే ఈ కుష్టువ్యాధి నుండి విడుదల లభించడంలోని రహస్యం ఏమిటి?
ఇలా పాత నిబంధనలో చెప్పబడిన సంఘటనలు చంద్రుని వెలుతురు వలె మసకగా కనిపిస్తాయి. కానీ దానిని కొత్త నిబంధన అనే సూర్యుని వెలుతురులో చూసినప్పుడు, అది మనకు బోధనలను, హెచ్చరికలను మరియు నిరీక్షణను ఇచ్చే మాదిరిలుగా ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి లేఖనాల ఆధారంగా వివరంగా పరిశీలిద్దాం.